Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న కెసిఆర్ : తలసాని

Yadav’s Meeting at Siddipet

సిద్ధిపేట : టిఆర్‌ఎస్ చీఫ్, సిఎం కెసిఆర్ రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడకముందు కాంగ్రెస్, టిడిపి పాలనలో కుల వృత్తులు నిర్వీర్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అన్ని కులవృత్తులను కెసిఆర్ ఉద్ధరించి, ఆయా కులాల్లో ఆత్మగౌరవం నింపారని ఆయన కొనియాడారు. సిద్ధిపేటలో గురువారం యాదవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పట్టణంలో యాదవులు భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి తలసానితో పాటు మంత్రి, సిద్ధిపేట టిఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. కెసిఆర్ యాదవులకు 70 లక్షల గొర్రెలను పంపిణీ చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం హరీశ్‌రావు అహర్నిశలు కృషి చేశారని ఆయన తెలిపారు. హరీశ్‌రావును లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యాదవులతో పాటు అన్ని కులాల వారి సంక్షేమం కోసం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేశారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ వందకు పైగా స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికార దాహంతో మహాకూటమిగా ఏర్పడి  ఓట్ల కోసం వస్తున్న వారిని తరిమికొట్టాలని ఆయన ప్రజలను కోరారు.  ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Yadav’s Meeting at Siddipet

Comments

comments