Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

డూప్ లేకుండా ఫైట్స్ చేశా

నాగశౌర్య, కశ్మీర పరదేశి, యామినీ భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నర్తనశాల’. శంకరప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. ఈనెల 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా యామినీ భాస్కర్‌తో ఇంటర్వూ విశేషాలు…

Yamini-Bhaskar 

నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో…
విజయవాడ మా స్వస్థలం. అక్కడే పుట్టి పెరిగాను. విజయవాడలోనే చదువుకున్నాను. హైదరాబాద్‌లో నాలుగేళ్లుగా ఉంటున్నాను.

యాక్షన్ సీక్వెన్స్‌లో…

‘నర్తనశాల’లో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. నాతో పాటు కశ్మీరా పరదేశి హీరోయిన్‌గా నటించింది. సాఫ్ట్ క్యారెక్టర్‌లో కశ్మీర నటిస్తే నేను అహంకారం ఉన్న అమ్మాయిగా కనిపిస్తాను. సినిమాలో నేను యాక్షన్ సీక్వెన్స్‌లో నటించాను. ఎలాంటి డూప్ లేకుండా ఫైట్స్ చేశాను. యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకోలేదు. కానీ ఈ సన్నివేశాలు చేయడానికి ముందు మూడు రోజుల పాటు కొంత ఫైట్స్ ప్రాక్టీస్ చేశాను.

మంచి పేరు తెచ్చే…

సినిమాలో నా పాత్ర పేరు సత్యభామ. హీరోయిన్‌గా నాకు మంచి పేరు తెచ్చే చిత్రమిది. ఈ సినిమా తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను.

అది కూడా ఓ కారణమే…

నా ఫొటోలను చూసి ‘నర్తనశాల’ చిత్రం కోసం దర్శకుడు శ్రీనివాస్ నన్ను ఎంపిక చేసుకున్నారు. నేను తెలుగు అమ్మాయిని కావడం కూడా ఓ కారణమే అని చెప్పాలి.

తదుపరి చిత్రాలు…

‘కీచక’ సినిమా తర్వాత ‘మున్నోడి’ అనే తమిళ్ సినిమాలో నటించాను. తర్వాత మారుతి చిత్రం ‘భలే మంచి చౌక బేరము’ చేశాను. అది వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. కొత్త సినిమాలు ఏవీ ఇంకా సైన్ చేయలేదు.

పోటీ ఎక్కువైంది…

ఇప్పుడు యంగ్ హీరోయిన్‌లు ఎక్కువగా సినిమాల్లోకి వస్తున్నారు. దీంతో పోటీ ఎక్కువైంది. అందుకనే ఎక్కువ మంది యువ కథానాయికలు వరుసగా సినిమాలు చేయలేకపోతున్నారు. ఇక సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను.

Comments

comments