Home తాజా వార్తలు 82 ఏళ్ల క్రితం రికార్డు బద్దలు

82 ఏళ్ల క్రితం రికార్డు బద్దలు

 Yasir Shah

అబుదాబి: పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్య జరుగతున్నమూడో టెస్టు నాలుగో రోజు 82 ఏళ్ల క్రితం ఉన్న రికార్డును యాసిర్ షా బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో యాసిర్ 33 టెస్టులు ఆడి 200 వికెట్లు పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. 1936 వసంవత్సరంలో సౌతాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ లో ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్స్ 36 టెస్టులు ఆడి 200 వికెట్లు తీసుకున్నాడు. 82 సంవత్సరాల తరువాత ఈ రికార్డు కనుమరుగైంది. రెండో టెస్టులో పాక్ గెలిచి ఈ సిరీస్ ను సమం చేసింది. ఈ మూడు టెస్టులో యాసిర్ 14 వికెట్లు తీసుకున్నాడు. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు, రెండో ఇన్సింగ్స్ లో రెండు వికెట్లు తీసుకోవడంతో 200 వికెట్ల క్లబ్ లో చేరాడు.

Yasir Shah Becomes Fastest Bowler to 200 Test Wickets, Pakistan leg-spinner Yasir Shah breaking an 82-year-old record against New zealand