Home తాజా వార్తలు ‘యాత్ర’ థియేట్రికల్ ట్రైలర్

‘యాత్ర’ థియేట్రికల్ ట్రైలర్

Yatra Movie Theatricalహైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చ‌రిత్ర‌ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ‘యాత్ర’. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ గా నటిస్తున్నారు. పాదయాత్ర ముందు వైఎస్సార్‌కు ఎదురైన కొన్ని పరిస్థితులతో పాటు, పాదయాత్ర సాగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించినట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ట్రైలర్ లో ‘నా విధేయతని, విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ..జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది..వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది’, ‘మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే’  అనే సంభాషణలు బాగున్నాయి. మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కెవిపి రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారు. యాత్ర 2019 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Yatra Movie Theatrical Trailer is Released