Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

విశాఖలో జగన్ పాదయాత్ర

YCP Chief Jagan Pada Yatra Enter in Visakhapatnam

విశాఖ : వైసిపి చీఫ్ జగన్ చేపట్టిన పాదయాత్ర సోమవారంతో 237వ రోజుకు చేరుకుంది. సోమవారం ఆయన పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద ఆయన విశాఖ జిల్లాలోకి ప్రవేశించారు. అయితే ఈ రోజు ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. విశాఖ జిల్లాలో శరభవరం, శృంగవరం, గాంధీనగర్, వై దొండపేట జంక్షన్, ఎర్రవారం మీదుగా ఈరోజు ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.

YCP Chief Jagan Pada Yatra Enter in Visakhapatnam

Comments

comments