తూర్పుగోదావరి : అనపర్తి నియోజకవర్గంలో వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. జగన్ తన 211వ రోజు పాదయాత్రను బిక్కవోలు మండలం ఊలపల్లి ఉంచి గురువారం ప్రారంభించారు. తన పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తెస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.