Home జాతీయ వార్తలు గుంటూరులో జగన్ పాదయాత్ర

గుంటూరులో జగన్ పాదయాత్ర

JAGAN

గుంటూరు : వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర సోమవారం గుంటూరు జిల్లాలో ప్రారంభమైంది. ఆరు జిల్లాల్లో 109 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర సోమవారం ఉదయం బాపట్ల మండలం స్టువర్టుపురం వద్ద గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్‌ఎ కోన రఘుపతి, ఎంఎల్‌సి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు వైసిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

YCP Chief Jagan Padayatra in Guntur