Home జాతీయ వార్తలు నెల్లూరులో జగన్ పాదయాత్ర

నెల్లూరులో జగన్ పాదయాత్ర

Jagan-Padayatra

నెల్లూరు : ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైసిపి చీఫ్ జగన్ చేపట్టిన పాదయాత్ర శనివారంతో 72వ రోజుకు చేరుకుంది. నెల్లూరులో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం చిలమానుచేను క్రాస్ రోడ్డు నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. గుర్రంకొండలో మాజీ సిఎం దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. జగన్ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజా సమస్యలు వింటూ, టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు.

YCP Chief Jagan Padayatra  in Nellore