Home జాతీయ వార్తలు డ్రామాలు ఆడుతున్న జగన్ : లోకేష్

డ్రామాలు ఆడుతున్న జగన్ : లోకేష్

LOKESH

అమరావతి : ఎపి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో వైసిపి చీఫ్ జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఎపి మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం ఐదు కోట్ల మంది ప్రజలు పౌరుషంతో పోరాడుతుంటే, మోడీని నిలదీసే దమ్ము, ధైర్యం లేని జగన్ ఎపి ప్రజలను మభ్యపెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జగన్‌ది క్విడ్ ప్రోకో డ్రామా అని ఆయన ఎద్దేవా చేశారు. వైసిపి ఎంపిలు మోడీ కాళ్లపై పడుతూ పిఎంఒ చుట్టూ తిరుగుతూ ప్రత్యేక హోదా ముసుగులో కేసుల మాఫీ కోసం పాకులాడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. జగన్ నాటకాన్ని ఎపి ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. జగన్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా, ఆయన్ను ప్రజలు నమ్మరని లోకేష్ తేల్చి చెప్పారు.

YCP Chief Jagan Playing the Drama in AP Special Status Issue  : Lokesh