Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

వైసిపి ఓ ఫేక్ పార్టీ : చంద్రబాబు

NCBN

అమరావతి : వైసిపి ఒక ఫేక్ పార్టీ అని ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలతో వైసిపి ఫేక్ రాజకీయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అధ్యక్షతన సోమవారం టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం  ఈనెల 20 సిఎం చంద్రబాబు చేపట్టనున్న దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలట్లో సామూహిక దీక్షలు చేపట్టాలని టిడిపి నేతలు నిర్ణయించారు. 13జిల్లాల్లో 13 మంది మంత్రులు దీక్ష చేయాలని, మిగిలిన మంత్రులు సిఎం దీక్షలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈనెల 21వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు చేయాలని , నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రోజుకో పథకంపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

YCP is a Fake Party : AP CM Chandrababu

Comments

comments