Home ఆంధ్రప్రదేశ్ వార్తలు వైసిపిని ప్రజలు, దేవుడు ఆశీర్వదించారు: జగన్

వైసిపిని ప్రజలు, దేవుడు ఆశీర్వదించారు: జగన్

 Jagan Mohan Reddy

 

అమరావతి: ప్రత్యేక హోదానే తమ అజెండా అని వైసిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం జగన్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రజలు, దేవుడు వైసిపిని ఆశీర్వదించారన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఇప్పుడు ఏం మాట్లాడబోనని అని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన మోడీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం తాము ముందే ఊహించామన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి 150 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా టిడిపి 24 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో లీడ్ లో ఉన్నారు.