Home జాతీయ వార్తలు వైసిపి నేతల ఛలో ఢిల్లీ యాత్ర

వైసిపి నేతల ఛలో ఢిల్లీ యాత్ర

JAGAN

ప్రకాశం : వైసిపి నేతల ఛలో ఢిల్లీ యాత్రను ఆ పార్టీ చీఫ్ జగన్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఢిల్లీ బాట పట్టారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఈ యాత్ర చేబట్టారు. ప్రకాశం జిల్లా తాళ్లూరులో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు శనివారం కలిశారు. ప్రత్యేక హోదా పోరాటం గురించి జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేశారు. ఈనెల 5న ఢిల్లీ సంసద్ మార్గ్‌లో ప్రత్యేక హోదా కోసం వైసిపి నేతలు ధర్నా చేయనున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైసిపి చేస్తున్న పోరాటంలో అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

YCP Leaders Chola Delhi Yatra