Home ఆంధ్రప్రదేశ్ వార్తలు 25న వైసిపి శాసనసభా పక్ష సమావేశం

25న వైసిపి శాసనసభా పక్ష సమావేశం

Jaganఅమరావతి : ఎపి అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ క్రమంలో టిడిపి పూర్తిగా వెనుకంజలో ఉండగా వైసిపి మాత్రం విజయం వైపు దూసుకెళుతోంది. ఇప్పటి వరకు వైసిపి 152అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో ఉంది. టిడిపి 22 స్థానాల్లో, జన సేన ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఎపి మంత్రులు చాలా మంది వెనుకంజలో ఉన్నారు. లోక్ సభ స్థానాల్లో 23 స్థానాల్లో వైసిపి ఆధిక్యంలో ఉండగా, టిడిపి 2 స్థానాల్లో ముందంజో ఉంది. ఇదిలా ఉండగా వైసిపి చీఫ్ జగన్ శారదాపీఠం అధిపతి స్వరూపానందస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నెల 25న (శనివారం) వైసిపి శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమాావేశం జరగనుంది. ఈనెల 30 జగన్ సిఎంగా ప్రమాణం చేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

YCP Legislative Party Meeting on May 25th