Home జాతీయ వార్తలు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అరెస్టు

వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అరెస్టు

YCP MP Vijayasai Reddy was Arrested at Visakhapatnam

విశాఖపట్నం : వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలో మంగళవారం జరిగిన టిడిపి ధర్మపోరాట సభకు వేదికైన మైదానాన్ని శుద్ధి చేయాలన్న ఆలోచనతో విజయసాయిరెడ్డి, వైసిపి కార్యకర్తలు, నేతలు బుధవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఎయు మైదానం వైపు వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైసిపి శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి 16వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో విజయసాయిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

YCP MP Vijayasai Reddy was Arrested at Visakhapatnam