Search
Sunday 23 September 2018
  • :
  • :

కొనసాగుతున్న వైసిపి ఎంపిల ఆమరణ దీక్ష

YCP-MPs

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఎంపిలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారంతో రెండో రోజుకు చేరుకుంది. ఎపి భవన్‌లో వారు దీక్ష చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వర్షానికి టెంట్లు పడిపోవడంతో ఎపి భవన్ కారిడార్‌లో వారు దీక్ష కొనసాగిస్తున్నారు. వారి దీక్షకు పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు మద్దతు తెలిపారు. దీక్ష చేస్తున్న ఎంపిలకు వైద్యులు పరీక్షలు చేశారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ దీక్షల్లో వైసిపి ఎంపిలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

YCP MPs Hunger Strike at AP Bhavan in Delhi

Comments

comments