Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

క్షీణిస్తోన్న వైసిపి ఎంపిల ఆరోగ్యం

MIDHUN

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఎంపిలు ఢిల్లీలోని ఎపి భవన్‌లో ఐదురోజులుగా ఆమరణనిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. శనివారం ఎంపి మేకపాటి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. సోమవారం వైవి సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను కూడా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీక్ష చేస్తున్న మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. అయినప్పటికీ వారు దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం వారికి వైద్యులు పరీక్షలు చేశారు. మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తాము దీక్ష విరమించబోమని ఎంపి మిథున్‌రెడ్డి తేల్చి చెప్పారు.

YCP MPs Protest for AP Special Status at AP Bhavan in Delhi

Comments

comments