Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

వైసిపి ఎంపిల రాజీనామా

YCP


ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో సహా విభజన హామీలు అమలు చేయాలని వైసిపి ఎంపిలు రాజీనామా చేశారు. వైసిపి ఎంపిలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించారు. లోక్ సభ స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వరప్రసాద్‌లు ఉన్నారు.

ఎంపిల రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వైసిపి సభ్యులను స్పీకర్ కోరారు. సభలో ఉండి పోరాటం చేయవచ్చుకదా అని సదరు ఎంపిలకు సూచించారు. రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసిపి ఎంపిలు కోరారు.

Comments

comments