Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

బడ్జెట్‌కు నిరసనగా వైసిపి ఆందోళన

ycp

విశాఖపట్నం : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎపికి మొండి చెయ్యి చూపించారని, బడ్జెట్‌లో రైల్వే శాఖకు సరైన నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ వైసిపి కార్యకర్తలు విశాఖలోని అశీల్‌మెట్ జంక్షన్‌లో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. వేతన జీవులకు ఎటువంటి ఊరట కల్పించలేదని వారు ఆరోపించారు. బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్ ఊసెత్తలేదని, దీంతో ఎపి ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి శ్రేణుల ఆందోళనతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

YCP Protest Against Central Budget

Comments

comments