Home ఆంధ్రప్రదేశ్ వార్తలు నగరిలో కొనసాగుతున్న రోజా జోరు…

నగరిలో కొనసాగుతున్న రోజా జోరు…

rojaఅమరావతి: ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి జెట్ స్వీడ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే 150 నియోజకవర్గాల్లో వైసిపి ముందంజలో ఉంది. తాజాగా నగరి నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి రోజా ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టిడిపి అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై ఆమె 4,200 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

మరోవైపు విజయనగరంలోని కురుపాంలోని పాముల పుష్పవాణి అధిక్యంలో కోనసాగుతున్నారు. ప్రస్తుత అప్ డేట్స్ ప్రకారం జగన్ వైసిపి 150 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా… 24 స్థానాల్లో టిడిపి అధిక్యంలో ఉంది. ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ మాత్రం కేవలం 1 స్థానంలో మాత్రమే లీడ్ లో ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సిఎం కాబోతున్నారని రోజా చెప్పిన సంగతి తెలిసిందే.

YCP Roja Leading From Nagari