Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

‘యే దిల్ హై ముష్కిల్’కు తొలగిన అడ్డంకులు

Ye-Dil-Hai-Mushkilరణబీర్ కపూర్, ఐశ్వ ర్యారాయ్, అనుష్క శర్మ హీరోహీరోయిన్‌లుగా నటించిన ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రం రిలీజ్‌కు అడ్డంకులు తొలిగాయి. పాకి స్తాన్ నటులున్న ఈ చిత్రాన్ని విడుదలకానివ్వబోమంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన జారీ చేసిన అల్టిమేటం పెద్ద గొడవకు దారితీసింది. కరణ్ జోహార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ హాట్‌హాట్‌గా నటించింది. ట్రైలర్‌లలో ఐష్ రొమాంటిక్ యాంగిల్ యూత్‌ను మురిపించింది. దీపావళి కానుకగా ఈనెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించగా ఎంఎన్‌ఎస్ హెచ్చరికల తర్వాత కరణ్‌జోహార్ రిలీజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి విడుదల తేదీ దగ్గరపడడంతో ఎంఎన్‌ఎస్ ఛీఫ్ రాజ్ థాకరే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ‘యే దిల్ హై ముష్కిల్’ నిర్మాతలు చర్చలు నిర్వహించారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్‌కు అడ్డుపడబోమంటూ ప్రకటించారు రాజ్ థాకరే. కానీ పాకిస్తానీ నటులు ఉన్న ఏ సినిమా అయినా సరే రిలీజ్‌కు తాము సహకరించాలంటే… ఆ చిత్ర నిర్మాతలు 5 కోట్ల రూపాయలను ఆర్మీ రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని తీర్మానించాడు. దీనికి కరణ్‌జోహార్ అంగీకరించడంతో ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాకు అడ్డంకులు తొలిగాయి. అలాగే భవిష్యత్తులో కూడా పాక్ నటులను బాలీవుడ్ సినిమాల్లోకి తీసుకోబోమని ఒక లెటర్ కూడా రాసివ్వమని చెప్పాడట రాజ్ థాకరే.

Comments

comments