Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

యడ్యూరప్ప రాజీనామా

Yeddyurappa Resigned to CM Post

బెంగళూరు : కర్నాటకానికి తెరపడింది. యూడ్యరప్ప సిఎం పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 104 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78 , జెడిఎస్ 38 సీట్లు గెలుచుకుని తరువాతి స్థానాల్లో నిలిచాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ బిజెపిని ఆహ్వానించారు. దీంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్, జెడిఎస్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సభలో శనివారం యడ్యూరప్ప బల నిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో శనివారం శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో ఎంఎల్‌ఎల ప్రమాణస్వీకారం తరువాత యడ్యూరప్ప అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన తన సిఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌కు అందించనున్నారు.

Yeddyurappa Resigned to CM Post

Comments

comments