Home నల్లగొండ ఈ రంగులో ఉన్న కప్పలను ఎప్పుడైనా చూశారా…

ఈ రంగులో ఉన్న కప్పలను ఎప్పుడైనా చూశారా…

Frog

ఇప్పటి వరకు మనం గోధుమగా వర్ణం, ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉన్న కప్పలనే చూశాం. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో పసుపు పచ్చ రంగులో కప్పలు దర్శనమిచ్చాయి. భారీ ఎత్తున కప్పలు ఆ ప్రాంతంలో అటూ ఇటూ దుముకుతుంటే వాటిని చూడడానికి చుట్టపక్కల నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు.