Home అంతర్జాతీయ వార్తలు యెమెన్‌పై దాడులు : పెరిగిన మృతుల సంఖ్య

యెమెన్‌పై దాడులు : పెరిగిన మృతుల సంఖ్య

ACCIDENTసనా : యెమెన్ రాజధాని సనాపై జరిగిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు సుమారు 140 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వెల్లడించారు. సౌదీ అరేబియా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు ఈ దాడులు నిర్వహిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను సౌదీ ప్రభుత్వం తోసిపుచ్చింది. అమెరికా కూడా ఈ ఘటనపై స్పందించింది. వెంటనే దాడులపై సమీక్ష చేయనున్నట్లు వెల్లడించింది. తమ మద్దతును మరోమారు సమీక్షించుకుని యెమెన్‌లో సంక్షోభం ముగిసేటట్లు చర్యలు తీసుకుంటామని అమెరికా స్పష్టం చేసింది.