Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

‘ఎంత సక్కగున్నావే’ ప్రోమో పాట వచ్చేసింది…

Yentha Sakkagunnave Song

హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘రంగస్థలం’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ ‘చిట్టిబాబు’గా, సమంత ‘రామలక్ష్మీ’గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రెండు టీజర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ‘ఎంత సక్కగున్నావే’.. అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. పాటలో చరణ్, సమంతల యాక్టింగ్ సింప్లీ సూపర్బ్ గా ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కాగా, భారీ అంచనాలతో ‘రంగస్థలం’ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments