Home జనగామ కేసీఆర్ కృషితోనే రైతులకు మంచిరోజులు

కేసీఆర్ కృషితోనే రైతులకు మంచిరోజులు

yerrabelli-dayakar-rao

మన తెలంగాణ/పాలకుర్తి ః ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రైతులకు మంచిరోజులు వచ్చాయని పాలకుర్తి ఎమ్మేల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం తొర్రూర్, ఇసునూర్, బమ్మెర, గ్రామాలలో జరిగిన రైతుబంధు పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయా గ్రామాల రైతు సమితి కోఆర్డీనేటర్లు గంట చంద్రయ్య, ఎర్రబెల్లి రాఘవరావు, దార్న శంకరయ్యలు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి హాజరైనా ఎమ్మేల్యే దయాకర్‌రావుతో పాటు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ దరావత్ మోహన్‌గాంధీ నాయక్ రైతు సమితి జిల్లా కోఆర్డీనేటర్ ఇర్రి రమణారెడ్డిలకు అ గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు బోనాలు, బతుకమ్మలు, కోళాటాలతో, డప్పు చప్పుల్లతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మేల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వ్యవసాయాన్ని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తియితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువుల్లో 360 రోజులు నీరు ఉంటందన్నారు. నియోజకవర్గంలో వ్యవసాయ రంగం అభివృద్ది చేయడానికి నష్కల్, పాలకుర్తి, చెన్నూరు, రిజర్వాయర్లు పూర్తిఅయితే ఈ ప్రాంతం పాడి పంటలతో సస్యశ్యామలంగా అభివృద్ది చెందుతున్నారన్నారు. జూన్ 2 నుండి రైతుల కోసం రైతుభీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. మృగశిర కార్తిలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తేకుండా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడుల కింద ఎకరాకు 4 వేల చొప్పున రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తుందని పేర్కోన్నారు. కొంతమంది వీఆర్‌వోల తప్పదంవల్ల పాసుబుక్కులు రాని రైతులకు వారం రోజుల్లో పాసు బుక్కులు, చెక్కులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి మండల కోఆర్డీనేటర్ వీరమనేని యాకాంతరావు, గంగు క్రిష్ణమూర్తి, బాలునాయక్, ఏడీఏ రాధిక, తహశిల్దార్ భన్సిలాల్, ఏవో రమాదేవి, సర్పంచ్‌లు మాటూరి యాకయ్య, నల్ల నాగిరెడ్డి, వంగాల ఎల్లమ్మ, ఎంపీటీసీలు చిదురాల దనంజయ, గీత, కృపాకర్, నాయకులు బత్తిని చిన్న సోమయ్య, ఎండి. అబ్బాస్‌ఆలీ, గోపాల్, యాకస్వామి తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటలకు పెట్టుబడి సహయంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబందు కార్యక్రమం శుక్రవారంతో మండలంలో ముగిసింది. ఈనెల 10 నుండి 18 వరకు వివిద స్థాయి అధికారులు ఎంపిడిఓ అశోక్‌కుమార్, ఎఓ కృష్ణారెడ్డి, ఎంఈఓ ప్రభాకర్, ఎస్సై చల్లారాజు, నేతృత్వంలో 4 బృందాలుగా విభజించి చెకుకుల, పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని 8 రోజుల పాటు నిర్వహించినట్లు తహశీల్ధార్ మేడిపల్లి సునీత తెలిపారు. మండలంలో సుమారు మొత్తం రైతులు కాగా పాసు పుస్తకాలు, చెక్కులు 10372 మంజూరు కావడం జరిగిందని, రైతులకు పాసు పుస్తకాలు చెక్కులు రైతులకు అందించడం జరిగిందని పేర్కోన్నారు. రైతుబందు చెక్కుల పంపిణీలో ఎలాంటి ఆవాంచనీయ ఘటనలు చోటు చేసుకోని శాంతీ బద్రతలకు విఘాతం కలగకుండా ఎస్పీ ఆధేశాల మేరకు భూపాలపల్లి డిఎస్పీ నేతృత్వంలో రిజర్వ్ సిఐ శివప్రసాద్. స్థానిక ఎస్సై చల్లారాజు ప్రత్యేక పోలీసు బలగాలను మొహరింపజేసి భారి బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రశాంతంగా మండలంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ముగియడంతో రెవేన్యూ, పోలీసు అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిదులు ఊపిరి పిల్చుకున్నారు.
చిన్నగూడురు ః మండలంలోని ఐదు గ్రామాల రైతులకు ఇప్పటి వరకు 2458 చెక్కులను ,2443 పాస్ బుక్కులను పంపిణీ చేసినట్లు తహాసీల్థార్ అనురాధ బాయి, వ్యవసాయ టెక్నికల్ అధికారి స్వామినాయక్ అన్నారు. మండలంలోని శుక్రవారం మండల కేంద్రంలో చెక్కుల పంపిణీ అనంతరం తహాసీల్థార్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ గ్రామాల వారిగా చిన్నగూడురు గ్రామానికి 814 పాస్ బుక్కులకు గాను, 703 పంపిణి, జయ్యారం 1020 పాస్ బుక్కులకు గాను 771 పంపిణీ, ఉగ్గంపల్లిలో 463 పాస్ బుక్కులకు గాను 312 పంపిణి, గుండంరాజుపల్లిలో 418 పాస్ బుక్కులకు గాను, 383 పంపిణి, ఇస్సంపల్లి 439 అందులో 274 పాస్ బుక్కులను పంపిణి చేసినట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాస్ బుక్కులు రాలేదని, ఆందోళన చెందవద్దన్నారు. తప్పులు సరిచేసేందుకు తహసీల్థార్‌ను సంప్రదించాలని సూచించారు. రెవిన్యూ అధికారులు అందుటులో ఉన్నట్లు తెలిపారు, చిన్నగూడురు మండల కేంద్రంలోని విఆర్‌ఓ సుధర్శన్, ఇప్పటి వరకు 701 పాస్ బుక్కులను పంపిణి చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు కూడా మండల కేంద్రంలోని రెవిన్యూ కార్యాలయంలో తీసుకోవాలని వారు సూచించారు.
గార్ల ః ప్రభుత్వం నిబంధలకు అనుగుణంగా గ్రామాల్లో విస్తృంతంగా రైతుబంధు చెక్కులు పంపిణి చేసిన అధికారులు అంగవైకల్యం కలిగి వృద్దప్యంలోఉన్న రైతులకు నేరుగా ఇంటివద్దనే చెక్కుల పంపిణికి గార్ల మండల రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టడం జరిగింది. మండల తాహశీల్ధార్ అదేశాల మేరకు గార్ల పట్టణ రెవెన్యూ అధికారి వి.రాములు శుక్రవారం నాడు వృద్దరైతుల నివాసాలకు పోయి రైతుబంధు చెక్కులు అందించడం జరిగింది. ఈసందర్భంగా స్థానిక విఆర్‌ఒ రాములు మాట్లాడుతూ గార్ల రెవెన్యూ పరిధిలో అర్హులైన ప్రతిరైతుకు రైతుబంధు చెక్కులు అందజేయడం జరుగుతుందన్నారు. సాకేతిక కారణాల వల్లా రైతుబంధు చెక్కులు రాని రైతులు తాహశీల్ధార్ కార్యాలయంకు సంప్రదించి తమభూముల వివరాలు తెలిపి రైతుబంధు చెక్కులు పొందాలని ఆయన కోరారు.