Home జోగులాంబ గద్వాల్ నాడు హామీ ఇచ్చారు.. నేడు నెరవేర్చారు..

నాడు హామీ ఇచ్చారు.. నేడు నెరవేర్చారు..

 

stand

* నెలబండ తండాలో కేసిఆర్ పల్లె నిద్ర జ్ఞాపకాలు..
* మాటిచ్చి నెరవేర్చారంటూ లంబాడీల హర్షం..
* మా తండాలో మా రాజ్యానికి త్వరలో శుభగడియలు..
* మరో మారు నెలబండ తండాను సిఎం కేసిఆర్
సందర్శించే అవకాశాలు..
* తండా అభివృద్ధిపై మంత్రి లకా్ష్మరెడ్డి పర్యటన..
* కేసిఆర్ మా గ్రామానికి వస్తే చాలు.. అదే పదివేలు..
* టిఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్య నాయక్

మనతెలంగాణ/బాలానగర్:మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు.. ఇచ్చిన మాటకు కట్టు బడి ఉన్నాం.. హామీలను నెరవేరుస్తాం.. అంటూ పలికే ముఖ్యమంత్రి కేసిఆర్ హామీలను నెరవే ర్చుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. టిఆర్‌స్ పార్టీని స్థాపించిన కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో, గిరిజన తండాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యక్షంగా 2008లో పల్లె నిద్ర చేసిన కేసిఆర్ తం డాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తేనే బతుకులు బాగుపడుతాయంటూ నాడు ఆవేధన వ్య క్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తాండాలను ప్రత్యేక పంతాయతీలుగా గుర్తిస్తున్నట్లు ప్రక టించి లంబాడీలకు వరమిచ్చిన దైవంగా కేసిఆర్ కీర్తింపబడుతున్నాడు. నాడు పల్లెల్లో నిద్ర చేసి పార్టీ కార్యకర్తలతో ఆయన గడిపిన క్షణాలు నేడు ఎంతో కీలకమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆ నాటి జ్ఞాపకాలను ఒక్కసారి తాండా వా సులు గుర్తు చేసుకొని సంబరబడిపోతున్నారు. అంతే కాకుండా పంచాయతీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసిఆర్ వస్తారన్న వార్త హల్‌చల్ చేయడంతో తాండా వాసులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక పంచాయతీల డిమాండ్ ప్రస్తానం..
1997 నుండి తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీ లుగా చేయాలని ఎల్‌ఎచ్‌పిఎస్ ఆద్వర్యంలో ఉద్యమాలు చేశారు. అదే విదంగా అప్పట్లో 11 ఏప్రిల్ 2008 లో మ హబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజీపూర్ గ్రామ పంచాయతీలోని నేలబండ తాండాలో టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అద్యక్షునిగా ఉన్న కేసిఆర్ పల్లెనిద్ర చేశారు. ఈ సందర్బంగా తాండాల స్థితిగతులు, జీవన విధానాలు, మౌళిక వసతులు, సమస్యలపై ప్రత్యేకంగా పరిశీలిం చారు. దీంతో తాండాల దశ.. దిశ మారాలంటే తాండాల ను ప్రత్యేక పంచాయతీలుగా చేయాల్సిన అవసరం ఉంద ని ఆయన వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు అయినవెంటనే తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయ తీలుగా చేయడం కోసం టిఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందని హామి ఇచ్చారు. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం అవతరించి టిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ, పల్లె నిద్రలో భా గంగా తాండా వాసులు స్థితిగతులను నెరుగా పరిశీలించి న నేపథ్యంలో తప్పని సరిగా తాండాలను పంచాయ తీలుగా చేస్తామన్న హామీ మేరకు ఇటీవల తాండాలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించారు.
కేసిఆర్ పల్లె నిద్రను గుర్తు చేసుకున్న తండా వాసులు..
టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కల్వకుంట్ల చంద్రశేఖ ర్ రావు కొనసాగుతున్న తరుణంలో తాండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలన్న ఎల్‌హెచ్‌పిఎస్ డిమాండ్ కు మద్దతు తెలుపుతూ తాండాల్లో పల్లె నిద్రలు చేసి స్థితి గతులను పరిశీలించారు. ఇందులో భాగంగానే 2008 ఎప్రిల్ 11 మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉమ్మడి బాలాన గ ర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామ పంచాయతి నేల బండ తండాలో బాలానగర్ టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్య క్షులు వాల్య నాయక్ స్వగృహంలో రాత్రి కేసిఆర్ బసచేశా రు. అక్కడే పలు వార్త పత్రికలు చదివి తాండా వాసులతో భోజనం చేశారు. దీంతో నాడు కేసిఆర్ చేసిన హామిని ఇటీ వల నెరవేర్చడంతో తాండా వాసుల్లో హర్షాతి రేకాలు వ్యక్తం అయ్యాయి. అంతే కాకుండా అప్పట్లో టిఆ ర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న వాల్య నాయక్ ప్రస్తుతం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తి స్తూ కేసిఆర్ తన ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొ ని సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. తాండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటన వెలువ డిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలుసుకొని ప్రత్యేక కృతజతలు తెలిపినట్లు వాల్య నాయక్ వివరించారు.
నేలబండ తాండాలో మంత్రి లకా్ష్మరెడ్డి పర్యటన..
నేలబండ తాండాను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి ఆదివారం సందర్శించారు. అం తే కాకుండా ఇటీవల గ్రామాన్ని సందర్శించిన మంత్రిని తాండా వాసులు సన్మానించారు. అంతే కాకుండా తాం డాలో చేయాల్సిన అభివృద్ది పనులపై మంత్రి ప్రత్యేక కార్య చరణ రూపొందించి అభివృద్ది చేయనున్నట్లు సమాచారం. అంతే కాకుండా తాండాకు చెందిన వాల్య నాయక్ ప్రస్తు తం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగుతూ తాండా అభివృద్ది కోసం ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిపారు. ఏది ఏమైనా నాడు కేసిఆర్ పల్లె నిద్ర చేసిన నెలబండ తాం డాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం త్వరితగతీన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. అంతే కా కుండా సిఎం కేసిఆర్ తాండాను సందర్శించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కోంటున్నారు. తాండాలో 50 డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం స్థలాన్ని, అంగన్ వాడి భవనం, పాఠశాల ప్రహారిగౌడ, 1500 మీటర్ల సిసి రోడ్డు, తాండాకు బిటి రోడ్డు, ఎల్‌ఈడి దీపాలతో పాటు మరిన్ని అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు వాల్య నాయక్ తెలిపారు.