Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తెల్ల బంగారానికి తెగులు

Yield increases if converted Crop

వాణిజ్య పంటలపై రైతుల అమితాసక్తి
పంట మార్పిడి చేస్తే దిగుబడి అధికం
పత్తి పంటను సాగుచేయడానికే మొగ్గు

మన తెలంగాణ/ వికారాబాద్ రూరల్: వాణిజ్య పంటలపై అమితాసక్తిని రైతులు చూపిస్తున్నారు . వాణిజ్య పంటలను సాగు చేస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని పలువురు రైతుల అభిప్రాయం. వాతావరణం అనుకూలంగా ఉండడంతో మంచి దిగుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది రైతులు పత్తి, మక్కజొన్న, స్వీట్‌కార్న్ వంటి పంటలను ఎక్కువగా పండించుటకు ఉత్సాహం చూపుతున్నారు. వ్యవసాయాధికారులు పంట మార్పిడి చేస్తే దిగుబడి అధికంగా వస్తుందని రైతులకు సూచిస్తున్నారు. పత్తి పంటను తగ్గించి కూరగాయల పంటలను అధికంగా సాగుచేస్తే రైతులు ఆర్థికంగా స్థిరపడుతారని వ్యవసాయాధికారులు చెబుతున్నా రైతులు మాత్రం పత్తి పంటను సాగుచేయడానికే ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. వికారాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన సిహెచ్.మల్లేశంకు ఎకరన్నర పొలంలో పత్తి సాగుచేస్తున్నాడు. ఏపుగా పెరుగుతున్న పత్తి మొక్కలను మాయ తెగుళ్ళు సోకి పంట నాశనానికి హేతువు అవుతుంది. పత్తి పంటకు పేను తెగుళ్ళు సోకి పంట ఎదుగుదలకు ఆటంకంగా మారింది. పెట్టినపెట్టుబడులు చేతికి రావేమోనని రైతులు దిగులుచెంది పంట ను కాపాడుకోడానికి రసాయనిక మందులను పిచికారీ చేయడం తప్పడం లేదంటున్నారు. అధిక పెట్టుబడులు పెట్టి పంటను కాపాడుకొనుటకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికారాబాద్ మండలంలోని 21 గ్రామాలలో వాణిజ్య పంటలతో పాటు, కూరగాయలను కూడా అధికంగా సాగుచేస్తున్నారు. తొలకరి వర్షాలకు పులకరించిన రైతులు పంటల సాగును సకాలంలోనే చేపట్టారు. గ త సంవత్సరం పత్తి పంటను సుమారు 1000 హెక్టార్లలో సాగుచేశారు. ఈసారి ఖరీఫ్‌లో ఇప్పటి వరకు సు మారు 18వేల హెక్టార్లలో పత్తి పంట సాగుచేస్తున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాధారణ పంట ల కంటే ఎక్కువ శాతం రైతులు పత్తి పంటను సాగుచేస్తున్నారు.

మోస్తారు వర్షాలు… వికారాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఈసారి మోస్తారు వర్షాలు సకాలంలో కురిసాయి. కొన్ని గ్రామాలలో రోహిణి కార్తెలోనే పత్తిని విత్తుకున్నారు. ఆశించిన స్థాయిలో మొక్కలు కూడా ఏపుగా పెరిగాయి. మొక్కలు బాగుండడంతో కలుపు మొక్కలను తొలగించి, ఎరువులు చల్లడం, సాళ్ళ మధ్య దంతెలు ప ట్టడం వంటి పనులు ఇప్పుడిప్పుడే జోరుగా సాగుతున్నా యి. మలిదఫా వర్షాలకు చాలా మంది రైతులు విత్తనా లు విత్తుకోని వారు విత్తుకున్నారు. మొలకెత్తి ఇప్పుడిప్పు డే నిలదొక్కుకుంటున్నాయి. ముందుగా పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులు పంట రక్షణకు రసాయనిక మందులను పిచికారి చేస్తున్నారు. బిటీ రకానికి చెందినవి పత్తి విత్తనాలు విత్తుకోవడం వలన క్రిమి సంహారక మందులు తొందరగా పిచికారి చేయాల్సిన అవసరం రాకపోవచ్చని పలువురు రైతులు అనుకుంటున్నారు. తెగుళ్ళు సోకితేనే మందులు పిచికారి చేయాల్సిన అవసరం ఉంటుందంటున్నారు.

ప్రస్తుతం నల్ల దోమ, పేను తెగులు ఆశించడంతో పంట నష్టమవుతుందని రైతులు గొణుక్కుంటున్నారు. దోమ వాలడం మూలంగా ఆకులు ముడుచుకొని నల్లగా మారుతున్నాయి. పంట ఏపుగా వస్తున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా తెగులు పోటుకు గురికావడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తెగుళ్ళు నివారణ కోసం ఖరీదైన మందులను పిచికారి చేయాల్సి వస్తోంది. నగదుపై తెచ్చుకునేందుకు రైతులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మందుల ధరలు అధికం కావడంతో పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. కొన్ని గ్రామాలలో పొలాల్లోకి మిడతలు, ఇతర పక్షులు చేరి ఎదుగుతున్న మొక్కలను నాశనం చేస్తున్నాయి. పంట దిగుబడులు తక్కువ గా వచ్చే అవకాశాలు మెండు. తెగుళ్ళ నివారణకు టి మెట్ వంటి పౌడర్ చల్లుతున్నారు. టిమెట్ పౌడర్ దుర్వాసనతో కూడుకున్నందున క్రిమికీటకాలు, పక్షులు పం టను ఆశించవని పలువురు రైతుల అభిప్రాయం.

Comments

comments