Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

8న క్రికెటర్లకు యో-యో పరీక్ష..

yo-yo-test

ముంబయి: అఫ్గానిస్థాన్ జరిగే చారిత్రక టెస్టు మ్యాచ్‌కు ఎంపికైన భారత క్రికెటర్లు తప్పనిసరిగా యోయో టెస్టుకు హాజరు కావాల్సిందేనని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. అఫ్గాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌కు ప్రాతినిథ్యం వహించనున్న ఆటగాళ్లందరూ బెంగళూరులో ఈ నెల 8న జరిగే యోయో టెస్టుకు హాజరు కావాలని బోర్డు సూచించింది. ఇందులో ఎవరికి మినహాయింపు లేదని బోర్డు స్పష్టం చేసింది. అంతేగాక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారతఏ జట్టుకు కూడా యోయో టెస్టు నిర్వహిస్తున్నట్టు బోర్డు తెలిపింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఫిట్‌నెస్ టెస్టులో నెగ్గితేనే టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంటుందని బోర్డు తెలిపింది. కాగా, అఫ్గాన్‌తో బెంగళూరు వేదికగా జరుగనున్న ఏకైక టెస్టు కోసం ఇప్పటికే టీమిండియాను ఎంపిక చేశారు. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేకుండానే భారత్ ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. అజింక్య రహానె భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కోహ్లితో పాటు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ తదితరులు ఈ టెస్టు మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. కాగా, వికెట్ కీపర్ సాహా గాయం బారీన పడడంతో అతనికి బదులు దినేష్ కార్తీక్‌ను జట్టుకు ఎంపిక చేశారు.

Comments

comments