Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

యోగాయుధం.. శక్తి సాధనం

Yoga .. power tool

మన తెలంగాణ/కొల్లాపూర్ : ఆరోగ్యమే మహ భాగ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కన్యాక పరమేశ్వరి కళ్యాణ మంటపంలో పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ సాధనకు మంత్రి జూపల్లి, వివిధ పాఠశాలల విద్యార్థులు, పట్టణ వాసులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్య నామస్కారాలు, వృక్షాసన్, దనర్‌సన్, లనులోమ విలోమం, బస్త్రిక ప్రణాయం, మండుకసం, సర్వంగసన్, ధాన్యం, సూక్ష్మవ్యాయమాలు, జాగింగ్ తదితరులు ఆసనాలు పతంజలి యోగ సమితి నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు అర్జున్‌గౌడ్ సాధన చేయించారు. మంత్రి అందరితో పాటు ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ఒక్క పైస ఖర్చులేకుండా యోగ ద్వారా సర్వరోగాలు తగ్గించుకోవచ్చునన్నారు.నేడు పని వత్తిడిలతో రోగాలతో ఆసుపత్రిలు కిటకిటలాడుతున్నాయని వీటికి పరిష్కారం యోగ ఒక్కటే మార్గం అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు యోగభ్యాసం చేయాలన్నారు.సాధన చేస్తేనే ఆసనాలు వేయగలం అన్నారు.మన నియోజకవర్గంలో చిన్నంబాయి మండలం అయ్యావారి పల్లిలో 106 సంవత్సరాలు శర్మ అనే వ్యక్తి ఆసనాలు వేసి అందరిని అశ్చర్యపడుస్తున్నట్లు మంత్రి పేర్కోన్నారు.ఆయన వేస్తున్న ఆసనాలు ఆద్భుతం అన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాల లేదా దేవాలయం అవరణలో లేదా గ్రామ పంచాయతీ అవరణలో యోగ చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.మనిషి తలుచుకుంటే ఏదైన సాధ్యం అన్నారు.పట్టణంలోని స్టేడియం గ్రౌండ్‌లో యోగ భవనం కోసం 40లక్షల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వివరించారు. ప్రతి ఒక్కరు గంట సమయం కేటాయించి యోగచేయాలన్నారు.అనంతరం మంత్రి జూపల్లిని యోగ సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మార్కెటు కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, ఎంపిపి చిన్న నిరంజన్‌రావు, జడ్‌పిటిసి హన్మంత్‌నాయక్, మార్కెట్ కమిటి వైస్,చైర్మన్ ఎక్బాల్, టిఆర్‌ఎస్ యువనాయకులు నరసింహ్మరావు,మాజీ ఎంపిపి నరేందర్‌రెడ్డి, ఇజిఎంఎం డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, శ్రీనువాస్‌రావు, మార్కెటు కమిటి మాజీ సభ్యులు ప్రభాకర్‌శేట్టి, బోరెల్లి మహేష్, ముక్కిడిగుండం సర్పంచ్ లోకేష్, ఎల్లూరు మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌శేట్టి, యోగ సమితి సభ్యులు శంకర్,ఎల్లయ్య, రాజు,ధనంజేయుడు, వెంకటయ్య,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments