Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

‘యోగా’తో ఆరోగ్యం – అదే మహాభాగ్యం

yogaమన తెలంగాణ/మహబూబ్‌నగర్ ప్రతినిధి: లేచింది మొదలు పడుకునే వరకు మనిషి క్షణం తీరిక లేకుండా వివిధ వ్యాపకాల్లో నిమగ్నమై కష్టించి పనిచేస్తాడు. యాంత్రిమైన నేటి సమాజంలో యోగ అనే మంత్రం ఆ మనిషి కి దీర్ఘాయు వును పోస్తుందని చెబు తారు. యోగ యొక్క మహాత్యాన్ని గ్రహించే ప్రపంచ సంస్థ అయిన యూఎన్‌ఓ దీన్ని ప్రతీ ఏటా 21జూన్ రోజున అంతర్జాతీయ యోగ దినంగా గుర్తిం చింది. యోగ మన దేశంలో 5వేల ఏళ్ల క్రితమే అమల్లోకి వచ్చినట్లు యోగ గురువులు చెబుతారు. ఇది గ్రహించి న దేశ ప్రధాన నరేంద్ర మో డీ యోగ దినాన్ని ప్రభుత్వ దినంగా గుర్తించి ప్రతి ఒక్కరూ యోగ నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. యోగ యొక్క విశిష్ట తను జాతి ప్రజలకు తెలియజేసేందకే యోగను సూచించే ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను సోమవారం విడుదల చేవారు. సూర్య నమస్కారక్ష పేరును తెలిపే సింబల్‌తో ఉన్న ఈ పోస్ట ల్ స్టాంప్స్‌లో 12 రకాల యోగాసనాలు వేస్తున్న స్టాంపులు ఉన్నాయి. యోగ చేయడం ఆరంభంలో కొంత కష్టమైని తోచినప్పటికి చేస్తుండడం వల్ల అది సులువుగా మా రి జీవన ప్రక్రియలో అదో భాగమైపోతుంది. యోగ ఆసనాల ద్వారా కొందరు యోగలో ప్రసిద్ధులేనవారు తమ శరీరాకృతిని రబ్బరు బంతి చుడుతారు. ఈ కోవలో బాబా రాం దేవ్ వస్తారు.‘సాధనమున పనులు సమకూ రు ధరలోన’ అన్న యోగి వేమన మాటలు అక్షర సత్యాలు. శరీర దారుఢ్యం, మం చి సౌస్టవం, ఆరోగ్యం అన్ని యోగ ద్వారానే సాధ్యం. యోగ సాధన చేసే వాడు ఎక్కువ కాలం జీవస్తాడనే పెద్ద ల మాట చద్దిమూట. అంత ర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్క రించుకుని జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తు న్నారు. స్థానిక స్టేడియం మైదానంలో యోగ కోసం ప్రత్యేక సదు పాయాలు కల్పిస్తున్నారు. యోగ నే ఆరోగ్యం.. యోగనే మహా భాగ్యమన్న నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగినాడు దేశం ఆరోగ్యవంతంగా ఉంటుందని పలువురు మేధావులు, పీఈటీలు పేర్కొంటున్నారు.

Comments

comments