Home ఆఫ్ బీట్ వీడియోలు మీరు రియల్ హీరోలు …

మీరు రియల్ హీరోలు …

AKSHAYశ్రీనగర్ : సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో అమరులైన జవాన్లకు బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నివాళులు అర్పించారు. జమ్మూలోని బిఎస్‌ఎఫ్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడికి వచ్చి భారత జవాన్లను కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నేను రీల్ హీరో మాత్రమేనని, మీరు రియల్ హీరోలు అంటూ సైనికులను కొనియాడారు. దేశంలో చాలా మంది సైనికులకు సహాయపడాలనుకుంటున్నారని, వారి కోసం ఒక యాప్‌ను రూపొందిస్తే బాగుంటుందని ఆయన తెలిపారు. ఇది రాజకీయం కాదని, తాను సైన్యం పట్ల ప్రేమ గురించే చెబుతున్నాని తెలిపారు. ఇప్పటికే చాలా మంది అమరులయ్యారని, అందువల్ల భారత్ – పాక్‌ల్లో శాంతి నెలకొల్పడమే సమస్యకు పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.