Home తాజా వార్తలు ఇప్పుడు అర్థమైందా మిస్టర్ సి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో

ఇప్పుడు అర్థమైందా మిస్టర్ సి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో

రామ్‌చరణ్, ఉపాసనలు చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే త్వరలో వీరి వివాహ వా ర్షికోత్సవం రానుండడంతో హాలిడే టూర్ కోసం ఆఫ్రికా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు వీ రిద్దరూ. ఈ విహారయాత్రకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తోంది ఉపాసన. అయితే తనలో ఏ లక్షణం నచ్చి చరణ్ తనను పెళ్లి చేసుకున్నాడో ఆమె చెప్పడం విశేషం. లయన్ సఫారీలో భాగంగా ఉపాసన సింహం పిల్లలతో ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆడుకొని తనలో ఎంత ధైర్యం ఉందో తెలియజేసింది. అంతేకాదు… “ఇప్పుడు అర్థమైందా మిస్టర్ సి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారో’ అంటూ కామెంట్ చేసింది. తనలోని ధైర్యం చూసి చరణ్ తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పింది. ఇకపోతే ఈ టూర్ పూర్తవగానే రామ్‌చరణ్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

You know why Charan married me: Upasana