Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

త్వరలో ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్

petrol

ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం: కేంద్ర  చమురు శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 

న్యూఢిల్లీ: బంకుల వద్ద క్యూలో నిలబడి పెట్రోలు, డీజిల్ లను కొనాల్సిన అవసరం లేకుండా త్వరలో హోమ్ డెలివరీని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆలోచన పరిశీలనలో ఉందని కేంద్ర చమురు శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అదే సమ యంలో ఆదివారం బంకులను మూసివేయాలనే పెట్రోలు పంపు డీలర్ల నిర్ణయానికి తమ మంత్రిత్వశాఖ ఆమోదం తెలుపబోదని అన్నారు. పెట్రో ఉత్పత్తులను ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు డోర్ డెలివరీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, దీనివల్ల కస్టమర్ల సమ యం వృథా కాదని అన్నారు. బంకుల వద్ద ఎక్కువ సమయం వేచిచూడకుండా.. క్యూల్లో ఉండాల్సిన పరిస్థితి కూ ఎడా రాదని అన్నారు. మే 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులను మూసివేయాలనే నిర్ణయానికి చెక్ చెప్పిన ప్రభుత్వం తాజాగా ఈ హోమ్ డెలివరీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

హోం డెలివరీ విషయాన్ని పెట్రోలి యం మంత్రిత్వశాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తు తం వంట గ్యాస్ ఎల్‌పిజిని మాత్రమే ఇంటికి డెలివరీ చేస్తు న్నారు. పెట్రోలు, డీజిల్, సిఎన్‌జి(కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) వంటి వాహన ఇంధనాల కోసం ప్రజలు నేరుగా రిటైల్ ఔట్‌లెట్లకే వెళ్లాల్సి వస్తోంది. ఇంతకుముందు చమురు మంత్రిత్వ శాఖ మే 1 నుంచి ఐదు నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను రోజువారీగా సమీక్షిస్తామని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ముందు ఈ ప్రధాన నగలాల్లో రోజువారీ రేట్ల మార్పును పరీక్షిస్తామని పేర్కొంది. ప్రపంచంలోనే మూడు అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్ ఎనర్జీ సెక్టార్‌లో సంస్కరణలు చేపట్టాలనుకుంటోంది.

దీని ద్వారా దిగుమతులు తగ్గించి, వాణి జ్య కొరతను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఇంధన కేంద్రాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేం దుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ప్రధాన్ అన్నారు. విని యోగదారుల్లో డిజిటల్ లావా దేవీలను ప్రోత్స హించడంలో భాగంగా ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు నగదు రహిత విధానం ద్వారా వినియోగ దారులకు 0.75 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నాయి. ప్రతి రోజూ 35 కోట్ల మంది ప్రజలు ఇంధన కేంద్రాలకు వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫ్యూయెల్ స్టేషన్ల వద్ద దాదాపు రూ.2500 కోట్ల విలువ చేసే లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నగదు రహిత లావాదేవీల రూ.150 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెరిగాయని ప్రధాన్ వెల్లడించారు.

Comments

comments