Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

‘యు టర్న్’ తీసుకున్న సమంత

sam

ప్రతి స్టార్ హీరోయిన్ కూడా ఒక వయసు దాటాక, పరిణతి సాధించాక  నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలని ఆశిస్తుంది. సినిమాను ఒంటి చేత్తో నడిపించాలని… లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని కోరుకుంటుంది. అదేవిధంగా సమంత  ఇప్పుడు నటనకు ప్రాధాన్యమున్న ఓ చిత్రాన్ని ప్రారంభించింది. స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ భామ కన్నడలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘యు టర్న్’ సినిమాను రీమేక్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేసింది. చివరికి తాజాగా రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ కోసం రాజమండ్రికి వచ్చిన సమంతను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చాను. తన కోసం వచ్చిన అభిమానుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత ‘యు టర్న్’ చిత్రీకరణ మొదలైన సంగతిని వెల్లడించింది. కన్నడలో ‘యు టర్న్’ను తెరకెక్కించిన పవన్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తీస్తున్నారు. ఇక ఈ చిత్రంతో సమంత నిర్మాతగా మారింది. నాగచైతన్యతో కలిసి ఆమె ఈ సినిమా నిర్మిస్తోంది. ఇది ఒక విభిన్నమైన థ్రిల్లర్ కథతో తెరకెక్కుతోంది.

Comments

comments