Home తాజా వార్తలు ఉరేసుకొని యువ నటి, గాయని ఆత్మహత్య..!?

ఉరేసుకొని యువ నటి, గాయని ఆత్మహత్య..!?

Bidisha-Bezbaruah

న్యూఢిల్లీ : ఇటీవలే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యువ నటి, గాయని బిదిశా బెజ్బరువా అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయారు. అస్సామీ నటిగా పాపులరయిన ఆమె ఢిల్లీలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిదిశా స్వస్థలం గువాహటి. అస్సాంలో గాయనిగా, నటిగా మంచి పేరున్న ఆమె ఇటీవలే ‘జగ్గా జాసూస్’ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇటువంటి సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిదిశది ఆత్మహత్యేనా? లేక మరొకటా? అనేది ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.