Home రాష్ట్ర వార్తలు పెళ్లయిన ఆరునెలలకే యువకుడి ఆత్మహత్య

పెళ్లయిన ఆరునెలలకే యువకుడి ఆత్మహత్య

  • శోకసంద్రంలో కుటుంబసభ్యులు

SUICIDE1

వరంగల్ : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆరెల్లి ప్రశాంత్(24) మండల పరిధిలోని నల్లబెల్లి గ్రామంలో నివాసం ఉంటూ ఆర్‌ఎంపిగా వృత్తి కొనసాగించుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడు. గత ఆరునెలల క్రితం ప్రశాంత్ మేనమామ అయిన కుమారస్వామికి కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందినవాడు. కుమారస్వామికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె అయిన ప్రియ(19) అనే అమ్మాయిని తన మేనల్లుడైన ప్రశాంత్‌కు ఇచ్చి ఆరునెలల కిందట వివాహం చేశారు. ఇదే క్రమంలో ప్రశాంత్‌కు గత సంవత్సరం నుంచి అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. పెళ్లయినా కూడా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడని గత రెండు రోజుల క్రితం తమ కుటుంబసభ్యులకు తెలిసింది. ఇదే క్రమంలో అదే గ్రామంలోని ఇద్దరు పెద్దమనుషులను పిలిపించి ప్రశాంత్‌ను గట్టిగా మందలించడంతో ఈ విషయం బయటకు వస్తుందని భయాందోళనకు గురై తన వ్యవసాయ బావి దగ్గర పురుగుల మందు తాగి తమ తండ్రి అయిన యాకయ్యకు మొబైల్ ద్వారా సమాచారం అందివ్వగా 108 సహాయంతో ఎంజిఎంకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడని ఎంజిఎంలోని వైద్యులు తెలిపారు. మృతిచెందిన సంఘటన తమ బంధువులకు, కుటుంబసభ్యులకు తెలవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం విభాగం దగ్గర తన భార్య అయిన ప్రియ ఏడుపు అందరిని కలిచివేసింది.