Home ఖమ్మం సరదాకు పోతే… ప్రాణం పోయే

సరదాకు పోతే… ప్రాణం పోయే

young-Boy-Died

ఖమ్మం: సరదాకు పోయి యువకుడు ప్రాణం పోగొట్టుకున్న సంఘటన రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం… పాత మణుగూరులో కోటకట్ట ప్రాంతానికి చెందిన దళిత యువకులు లింజపల్లి సమ్మయ్య, ఉండి శ్రీకాంత్‌లు సరదాగా మంగళవారం రోజు కట్టుమల్లారం దగ్గర రథంగుట్టలోని వాటర్‌ఫాల్స్ చూడటానికి వెళ్ళారు. అక్కడి నుండి రథంగుట్టపైకి వాటర్‌ఫాల్స్ పక్కనుండి గుట్ట ఎక్కుతున్న క్రమంలో లింజపల్లి సమ్మయ్య(19)అనే యువకుడు కాలుజారి క్రిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న శ్రీకాంత్ బయపడి విషయాన్ని దాయడంతో మూడు రోజులుగా సమ్మయ్య ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు శ్రీకాంత్‌ను గట్టిగా మందలించడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు. సమ్మయ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మణుగూరు ఎస్సై నరహరి ఆధ్వర్యంలో రథంగుట్టకు చేరుకోని మృతదేహాన్ని గుర్తించారు. యువకుని మృతదేహాం తరలించడానికి అనుకూలంగా లేకపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మణుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నరహరి తెలిపారు.