Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఢిల్లీ హోటల్‌లో యువజంట ఆత్మహత్య

Couple-Commits-Suicide
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్ లో శుక్రవారం యువజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలంగా మారింది. ఓయో ఆన్‌లైన్‌ హోటల్‌ సర్వీస్ ద్వార రూమ్ బుక్‌ చేసుకున్న ఆ జంట శుక్రవారం హోటల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పిడింది. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారఖా సెక్టార్‌ 17లో చోటుచేసుకుంది.
 పోలీసుల కథనం ప్రకారం… గురువారం ఆన్‌లైన్‌ ద్వార రూమ్ బుక్‌ చేసుకున్న ఓ యువజంట అదే రోజు హోటల్ లో దిగింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం హౌస్‌ కీపింగ్ సిబ్బంది వెళ్లి తలుపు తట్టింది. కాని ఎంతసేపటికి లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో హోటల్ సిబ్బంది తలుపు పగలకొట్టి లోపలి వెళ్లి చూసింది. అయితే అప్పటికే ఆ జంట గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని విగతజీవులుగా కనిపించింది.  దీంతో హోటల్ మేనజర్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 కాగా, ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఆ యువజంటది ఆత్మహత్యగా తేల్చారు. ఇక బలవన్మరణానికి పాల్పడిన యువకుడిని ద్వారకా సెక్టార్16గా, యువతిని ఢిల్లీ రోహిని ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. ఈ జంట గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి బలవన్మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదన్నారు. అంతేగాక మృతదేహాల వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కూడా దొరకకపోవడంతో పోలీసులు యువజంట ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments