Home తాజా వార్తలు యువరైతు ఆత్మహత్య

యువరైతు ఆత్మహత్య

Suicideమెదక్ /చిన్నశంకరంపేట : ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట మండలం దర్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీస్‌ల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దిరాములు అనే రైతు తనకున్న ఎకరంన్నర పొలంలో రెండు బోర్లు వేయగా అవి ఫెయిల్ అయ్యాయి. వర్షాదారానికి మొక్కజొన్న పంట వేయగా వర్షాలు లేక ఎండిపోతుంది. బోర్లువేయడానికి తెచ్చిన రూ. 3 లక్షల అప్పులు కుప్పలుగా మారడంతో ఎలా తీర్చాలంటూ మనోవేధనకు గురై శనివారం రాత్రి గ్రామంలో ఉన్న సింగిల్ ఫేస్ ట్రాన్‌సఫార్మర్ వద్ద కరెంటు తీగను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నగేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మల్లయ్య, లక్ష్మీల పెద్దకుమారుడు గత ఆరునెలల క్రితం అనారోగ్యంతో చనిపోగా చిన్నకుమారుడైన సిద్దిరాములు ఆత్మహత్యకు పాల్పడడంతో ఒకే ఏడాదిలో ఇద్దరు కుమారులు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని దయనీయ స్థితిలో రోదిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టించుకుని బాధితుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ శ్వేతా మహిపాల్ రెడ్డి, ఎంపిటిసి ఉప్పరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.