Home వికారాబాద్ వికారాబాద్ లో యువ రైతు ఆత్మహత్య

వికారాబాద్ లో యువ రైతు ఆత్మహత్య

Young farmer suicides in Vikarabad

కుల్కచర్ల: ఆర్థిక పరిస్థితులు భాగలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామానికి చెందిన సండ్రా బాలప్ప రోజులాగే పోలానికి వెళ్ళి రాత్రి సమయంలో పోలం దగ్గర చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహాత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్యంగా చేసిన అప్పులు ఎక్కువ కావడం మరియు పరిమితి మించడం కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారడం తదితర కారణాలతో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని కుటుంబికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలిసులు పేర్కొన్నారు.