Search
Wednesday 14 November 2018
  • :
  • :

నల్గొండలో యువతి ఆత్మహత్యాయత్నం

Young-girl-commeted-suside

నల్లగొండ: ప్రియుడితో వివాహం కోసం మూడు రోజుల పాటు నిరాహార దీక్షకు పూనుకున్న మౌనిక శనివారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. మూడు రోజులుగా చేపట్టిన దీక్షకు ప్రేమించిన వ్యక్తి నుంచి, అతని తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించకోవడంతో మహిళా సంఘాల మద్ధతుతో నిరాహార దీక్షకు పూనుకుంది. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొత్తపేట గ్రామానికి మంద వెంకన్న, ఎల్లమ్మ దంపతుల కూతురు మౌనిక కొండ కిందిగూడెం గ్రామానికి చెందిన పెరిక అయోధ్య, ఎల్లమ్మల కుమారుడు పెరిక చంటి ఇరువురు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ విషయమై ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో పెళ్లికి నిశ్చయించిన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే పెళ్లికి చంటి నిరాకరించడంతో మౌనిక చంటి ఇంటి ముందు సూర్యాపేట మహిళా జాగృతి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష చేపట్టింది. ఇంటికి తాళం వేసి చంటి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మౌనికకు ప్రజాధారణ పెరిగినప్పటికీ ప్రేమించిన వ్యక్తి నిరాకరిస్తున్నడని తీవ్ర మనస్థాపానికి గురైన మౌనిక పురుగుల మందును తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో గమనించిన మహిళా సంఘాల ప్రతి నిధులు, గ్రామస్థులు చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments