Home తాజా వార్తలు అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

Suicide

హైదరాబాద్: అబిడ్స్‌లో మయూరి అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్‌మెంట్‌ పదో అంతస్తు నుంచి దూకడంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలిని బర్కత్ పురాకు చెందిన జస్టిన్ కౌర్(18)గా పోలీసులు గుర్తించారు. నీట్ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై కౌర్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.