Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

Suicide

పాన్‌గల్:మండల పరిధిలోని వెం గలాయపల్లి గ్రామానికి చెందిన కవిత (24) అనే యువతి శనివారం అర్దరాత్రి ఆత్మహత్యకు పాల్పడి నట్లు ఎఎస్‌ఐ చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. ఆ యన తెలిపిన వివరాల ప్రకారం కవిత అర్దరాత్రి పురుగుల మందు తాగడంతో పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్సకోసం జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్దరాత్రి 3.00 మృ తి చెందిందని ఎఎస్‌ఐ తెలిపారు.

2014 సంవత్స రంలో అదే గ్రామానికి చెందిన మొగలి సురేష్‌గౌడ్ ను ప్రేమించిన కవిత ప్రియుడు సురేష్ మోసం చేయడంతో దాదాపు 10 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టింది అప్పటి నుండి సురేష్ గౌడ్ కుటుంబ స భ్యులు తరచు వేధించేవారని అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటేష్ రేషన్ షాపుపై పిర్యాదు చేసి రేషన్ షాపు తమకు రాకుండా చేస్తానని వేధిం చేవాడని యువతి తండ్రి పెద్దవెంకటయ్యగౌడ్ పిర్యా దులో పేర్కొన్నారని పిర్యాదు ఆధారంగా సురేష్ కుటుంబ సభ్యులతో పాటు వెంకటేష్ పై కేసు నమో దు చేయడం జరిగిందని ఎఎస్‌ఐ తెలిపారు.

యువతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు:
వెంగలాయపల్లి గ్రామంలో కవిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో విషయం తెలుసు కున్న మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఆసుపత్రిలో ని కవిత మృతదేహానికి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కవిత కుటుంబానికి 2014 నుండి తాను అండగా ఉన్నానని ఇక ముందు కూడా అండగా ఉంటానని అధైర్యపడవద్దని భరోసా నిచ్చారు. ఎంపిపి వెంకటేష్ నాయుడు, జడ్పిటిసి కేతెపల్లి రవి , టిఆర్‌ఎస్ అధ్యక్షులు గోవవర్దన్ సాగ ర్,నాయకులు నారాయణ రెడ్డి, రాజుగౌడ్, తదిత రులు ఉన్నారు.

Comments

comments