Home మంచిర్యాల యువతి న్యాయపోరాటం

యువతి న్యాయపోరాటం

Girl

నస్పూర్: పెండ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు న్యాయం చేయాలలని సహజ ప్రియదర్శిని అనే యువతి న్యాయదీక్ష కొనసాగిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నర్ర రమణరెడ్డి అనే యువకుని ఇంటి ముందు దీక్ష కొనసాగిస్తోంది. బాధితుల కథనంప్రకారం మంచిర్యాలకు చెందిన దుర్గయ్య కూతురు మడుగుల సహజప్రియదర్శిని ఎంబిఎ మంచిర్యాలకు చెందిన ప్రైవేటు షోరూంలో మార్కెటింగ్ ఎక్స్ క్యూటివ్‌గా విధులు నిర్వహిస్తుంది. అదే షోరూంలో మార్కెటింగ్ మేనే జర్‌గా రమణరెడ్డి విధులు నిర్వహించే వారు. ఇద్దరు పరిచయం అయ్యారు. గత నాలుగు సంవత్సరాల నుండి ఒక్కరికి ఒక్కరు ప్రేమించుకుంటున్నామని పెండ్లికూడ రమణరెడ్డి చేసుకుంటానని హామి ఇచ్చారని తెలిపారు. రెండు నెలల క్రితం వేరే పెండ్లి చేసుకుంటానని నువ్వుకూడ చేసుకోమని చెప్పాడని పరిచయ సమయంలో అవసర నిమిత్తం 10 లక్షల రూపాయలు తీసుకొని ప్రస్తుతం వేరే యువతితో డిసెంబర్ 1న పెండ్లి చేసుకుంటున్నాడని తెలియడంతో ఆదివారం మధ్యాహ్నం  రమణరెడ్డి ఇంటి ముందు న్యాయం చేయాలంటూ దీక్ష చేస్తోంది. సహజప్రియదర్శినికి మద్దతుగా దళిత సంఘాల నాయకులు మంతెన మల్లేష్,కొప్పర్తి రాజ్యంలు మద్దతు తెలిపారు.