Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కుటుంబ కలహాలతో …

Young Man and Woman Commits Suicide

హైదరాబాద్ : కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన నేనావత్ రవి అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే రవి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు మధు తండాలో కుటుంబ కలహాలతో కలమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

Young Man and Woman Commits Suicide

Comments

comments