Home తాజా వార్తలు గంజాయి మత్తులో బాలికను వివస్త్రను చేసి…

గంజాయి మత్తులో బాలికను వివస్త్రను చేసి…

Assaultహైదరాబాద్: భాగ్యనగరంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు గంజాయి మత్తులో బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. గంజాయి మత్తులో బాలికను వివస్త్రను చేసిన ఉన్మాది బ్లేడ్‌తో కోసి తీవ్రంగా గాయపరిచాడు. అతడి చిత్రహింసలు భరించలేక బాలిక గట్టిగా కేకలు పెట్టడం విన్న స్థానికులు యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలికను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Young Man Attack on Minor Girl with Razor Blade