Home తాజా వార్తలు యువకుడు దారుణ హత్య..!

యువకుడు దారుణ హత్య..!

Young Man brutally murder: Nizamabad District

నిజామాబాద్: ఓ యువకుడిని కొందరు దుండగులు అతి కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజు(23) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి, మృతదేహాన్ని మంజీర నది ఇసుకలో పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. అటుగా వెళ్లిన స్థానికులకు రాజు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, యువకుడి హత్యకు ఇసుక వివాదమే కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.