Home జాతీయ వార్తలు ఎఫ్‌బి లైవ్ స్ట్రీమ్‌లో యువకుడి ఆత్మహత్య…

ఎఫ్‌బి లైవ్ స్ట్రీమ్‌లో యువకుడి ఆత్మహత్య…

Suicide

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ యువకుడు ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న గురువారం వెలుగులోకి వచ్చింది. ఎఫ్‌బి లైవ్ స్ట్రీమింగ్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు 2800 మంది వీక్షించారు. ఏ ఒక్కరు కూడా పోలీసులకు కానీ అతడి తల్లిదండ్రులకు సమాచారమివ్వలేదు. తాను ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఐదు సార్లు ప్రయత్నించానని కానీ విఫలంకావడంతో జీవితంపై విరక్తి వచ్చిందన్నాడు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని ఆరు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. తన కుమారుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్ లో విఫలమైనందున కిరాణా షాపు పెట్టించానని అతడి తండ్రి వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.