Search
Sunday 23 September 2018
  • :
  • :

ప్రియురాలి కోసం ఇద్దరు ప్రియుల మధ్య గొడవ

 Young Man Commit Suicide In Siddipet
సిద్దిపేట రూరల్: ప్రియురాలి కోసం ప్రియుల మధ్య గొడవ జరిగి ప్రియుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట మండలం రావురూకుల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సిద్దిపేట ఎసిపి రామేశ్వర్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రావురూకుల గ్రామానికి చెందిన రోహిత్ రెడ్డి(18) మంగళవారం సాయంత్రం కళాశాల ముగిసిన తరువాత నంగునూరు మండలం దానంపల్లి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ తో రోహిత్‌రెడ్డి ఇరువర్గాల మధ్య ప్రేమ విషయంపై ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాలపై వన్‌టౌన్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ క్రమంలో రోహిత్ తండ్రి యాదిరెడ్డి, గ్రామానికి చెందిన బాబా లను పిలిపించి వారి పూచికత్తుపై రోహిత్‌రెడ్డి ని విడిచిపెట్టారు. రాత్రి ఇంటికి వెళ్లిన రోహిత్ మనస్థాపంతో గ్రామానికి చెందిన దొంగల చంద్రయ్య వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ బుధవారం రోహిత్‌రెడ్డి మృత దేహంతో సిద్దిపేట వన్‌పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ఆందోళలనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎసిపి తెలిపారు.

Comments

comments