Friday, March 29, 2024

లాక్‌డౌన్‌తో పెళ్లి వాయిదా…. యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young man commit suicide as marriage postpone due to lockdown

రాంచీ: లాక్‌డౌన్‌తో పెళ్లి వాయిదా పడడంతో తీవ్ర మనోవేధనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఝార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన అమ్మాయితో సంజిత్ గుప్తా అనే యువకుడికి ఏప్రిల్ 25న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది కలిగింది. దీంతో సంజయ్ తన పెళ్లి కోసం ఎన్ని కలల కన్నాడని, ప్రణాళికలు రచించికున్నాడని కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి అని కలత చెందేవాడు. శనివారం రాత్రి డిన్నర్ చేసిన అనంతరం సంజయ్ తన రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో సంజయ్ తండ్రి రాజేంద్ర ప్రసాద్ గుప్తా బాత్రూమ్‌కు వెళ్తుండగా కూమారుడు ఫ్యాన్ కు వేలాడుతుండడం గమనించి మిగితా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సంజయ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓలిదిహా పోలీసులు స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కన్న కుమారుడు చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ బోరున విలపించాడు. తన ముగ్గురు కుమారులు ఉన్నారని, అందులో ఒకరు చనిపోగా, ఒకడు అదృశ్యమయ్యాడని, చెట్టు అంత ఎదిగిన కుమారుడు ఇప్పుడు చనిపోవడంతో తనని ఆదరించేవాళ్లు లేరని తండ్రి రాజేంద్ర ప్రసాద్ తన బాధను వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News